అవును మీరు సరిగానే చదివారు నేను గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తున్నా . ఈ విషయం వినగానే(సారి చదవగానే అనాలేమో) ఓరి పిచ్చి కుంకా యోగి మీద వేస్తే వేశావ్ గాని గూగుల్ వాళ్ల మీదా కేసా వెయ్యడమే , వేసి గెలవడమే అసలు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అని అడగాలనుకుంటున్నారు కదా .............
మరే నిజమే గదా ......కనీ ఒక్క విషయం , అసలు చిన్న కొట్లాట(దీనినే దొమ్మీ కేసు అని కూడా అంటారు అనుకుంటా) కేసు కూడా సంవత్సరాలు పట్టే మన దేశంలో (క్షమించాలి నేను పక్కా దేశభక్తున్నే కాకపొతే నిజాన్ని మార్చలేను కదా )... సైబర్ కేసో లేకపోతె ఇంకేదో నా పిండాకూడు కేసో వేసి గెలుద్దాం అనుకుంటున్నాడు ఒక పెద్దమనిషి మరి ఎంత పెద్ద కేసైనా వారం లేకపోతేయ్ పది రోజులు మహాఅయితే ఒక నెల రోజుల్లో తేలిపోయే దేశం లో ఉన్న నేను కేసు వెయ్యాలి అనుకోవడం లో తప్పు లేదు కదండి.............
ఇహపోతే (అయ్యబాబోయి దీనికి కూడా కేసా నేను మిమ్మల్ని ఎక్కడికి పోమ్మనలేదు, అది నా ఊతపదం ) ....................
అసలు యోగి మీద నా అభియోగం ఏంటంటే ఈ మధ్య పిల్లోడికి తిక్క ఎక్కువ అయింది. నిజం అండి బాబు కావాలంటే మీరే చూడండి ...
ఈ మధ్య టపాలు అసలు నాకు అర్ధం కావడం లేదు . అన్ని కవితలు కాకర కాయలు రాస్తున్నాడు . నాకు అర్ధం కాకుండా టపాలు రాసినందుకు కేసు వేస్తున్నా ................
సరే ఇక గూగుల్ వాళ్ల మీద కేసు ఎందుకంటే నాయాల్ది(ఇక్కడ ఇది కూడా నా ఊతపదమ్, ఎవరిని తిట్టలేదు ) సరిగా అడిగారు ....................
ఇక్కడ బోలెడు కారణాలు
1. ముందుగా అనానిమస్ కామెంట్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, నువ్వు కామెంట్ మోడరేషన్ పెట్టుకోవచ్చు కదా అంటారా.......... మేము పెట్టుకోము కానీ గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తాం అంతే....
2. యోగి కి బ్లాగర్ ఎకౌంటు ఇచ్చినందుకు ..............
ఇంకా చాల వున్నాయి కానీ నేను చెప్పను ...................
నేను మాత్రం యోగి మీదా మరియూ గూగుల్ వాళ్ల మీదా కేసు వేస్తున్నా .............
అన్నట్లు చెప్పడం మర్చిపోయా జీడిపప్పు గారి మీదా కూడా కేసు వేసే ఆలోచనలో వున్నా ..............
ఎందుకంటే ఆయన మా కె .బా . స సభ్యుడైన శ్రీ మలక్ పెట్ రౌడీ గారి మీదా కేసు వేస్తున్నాడంటా..............కె.బా.స సభ్యునిగా నా మనోభావాలు మా వర్గపు (అదే కె.బా.స) మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాము
»» read more