About The Author

This is a sample info about the author. Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Quisque sed felis.

Get The Latest News

Sign up to receive latest news

Saturday, June 20, 2009

నేను యోగి మీద మరియు గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తున్నా

అవును మీరు సరిగానే చదివారు నేను గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తున్నా . ఈ విషయం వినగానే(సారి చదవగానే అనాలేమో) ఓరి పిచ్చి కుంకా యోగి మీద వేస్తే వేశావ్ గాని గూగుల్ వాళ్ల మీదా కేసా వెయ్యడమే , వేసి గెలవడమే అసలు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అని అడగాలనుకుంటున్నారు కదా .............
మరే నిజమే గదా ......కనీ ఒక్క విషయం , అసలు చిన్న కొట్లాట(దీనినే దొమ్మీ కేసు అని కూడా అంటారు అనుకుంటా) కేసు కూడా సంవత్సరాలు పట్టే మన దేశంలో (క్షమించాలి నేను పక్కా దేశభక్తున్నే కాకపొతే నిజాన్ని మార్చలేను కదా )... సైబర్ కేసో లేకపోతె ఇంకేదో నా పిండాకూడు కేసో వేసి గెలుద్దాం అనుకుంటున్నాడు ఒక పెద్దమనిషి మరి ఎంత పెద్ద కేసైనా వారం లేకపోతేయ్ పది రోజులు మహాఅయితే ఒక నెల రోజుల్లో తేలిపోయే దేశం లో ఉన్న నేను కేసు వెయ్యాలి అనుకోవడం లో తప్పు లేదు కదండి.............

ఇహపోతే (అయ్యబాబోయి దీనికి కూడా కేసా నేను మిమ్మల్ని ఎక్కడికి పోమ్మనలేదు, అది నా ఊతపదం ) ....................
అసలు యోగి మీద నా అభియోగం ఏంటంటే ఈ మధ్య పిల్లోడికి తిక్క ఎక్కువ అయింది. నిజం అండి బాబు కావాలంటే మీరే చూడండి ...
ఈ మధ్య టపాలు అసలు నాకు అర్ధం కావడం లేదు . అన్ని కవితలు కాకర కాయలు రాస్తున్నాడు . నాకు అర్ధం కాకుండా టపాలు రాసినందుకు కేసు వేస్తున్నా ................

సరే ఇక గూగుల్ వాళ్ల మీద కేసు ఎందుకంటే నాయాల్ది(ఇక్కడ ఇది కూడా నా ఊతపదమ్, ఎవరిని తిట్టలేదు ) సరిగా అడిగారు ....................
ఇక్కడ బోలెడు కారణాలు
1. ముందుగా అనానిమస్ కామెంట్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, నువ్వు కామెంట్ మోడరేషన్ పెట్టుకోవచ్చు కదా అంటారా.......... మేము పెట్టుకోము కానీ గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తాం అంతే....
2. యోగి కి బ్లాగర్ ఎకౌంటు ఇచ్చినందుకు ..............

ఇంకా చాల వున్నాయి కానీ నేను చెప్పను ...................

నేను మాత్రం యోగి మీదా మరియూ గూగుల్ వాళ్ల మీదా కేసు వేస్తున్నా .............



అన్నట్లు చెప్పడం మర్చిపోయా జీడిపప్పు గారి మీదా కూడా కేసు వేసే ఆలోచనలో వున్నా ..............

ఎందుకంటే ఆయన మా కె .బా . స సభ్యుడైన శ్రీ మలక్ పెట్ రౌడీ గారి మీదా కేసు వేస్తున్నాడంటా..............కె.బా.స సభ్యునిగా నా మనోభావాలు మా వర్గపు (అదే కె.బా.స) మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాము

37 comments:

Malakpet Rowdy said...

Hammayyaaaa .. I have solid support now ...

Lets take Jedipappu headon!!!!!!!!!!

విశ్వక్శేనుడు said...

@Malakpet Rowsy
పదండి ముందుకు పదండి తోసుకు ...
(ఇక్కడ నన్ను నూతన ప్రసాద్ చేతులు పైకి మడుస్తూ నడిచే సన్నివేశంలో ఊహించుకొవల్సినదిగా మనవి)

ఏక లింగం said...

నేను కూడా నా బ్లాగుకొచ్చే అందరి పైన కేసు వేస్తా. ఇంతమంది వస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టకుండా పోతున్నారు. నాబ్లాగుకు చాటుగా వచ్చి చదవడం బ్రాహ్మనికల్ అట్యిట్యూడ్. కామెంట్లు పెట్టక పోవడం కూడా బ్రాహ్మనికల్ అట్యిట్యుడ్. వాళ్ల అందరి IP address లు నాదగ్గరున్నాయి. IP address ఒక్కటిస్తే చాలు. మిగతా పని పోలీసులు చూసుకుంటారు. నేను బ్లాగర్ను అన్న ఒక్క అర్హత చాలు కేసు పెట్టడానికి.

ఇక్కడ చూడండి.
http://ekalingam.blogspot.com/2009/06/blog-post_20.html

నా బ్లాగుకు వచ్చి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లడం that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

----------------
హ..హ..హ.. చీప్ పోలిటిక్స్. ఏమో అనుకున్నాను గురుడు మాంచి కామెడీ చేస్తాడు.

అశోక్ చౌదరి said...

నువ్వు చాల వెనుక బడి వున్నావు.. నేను అయితే గూగుల్ మీద sc st act కింద కేసు పెదదమనుకుంటున్న.. ఎందుకు అని అడగకండి.. అది రాజ్యాంగం ఇచిన హక్కు..

విశ్వక్శేనుడు said...

@అశోక్
నాకు ఆ అవకాశంలేదు అశోక్.
నేను ఆ వర్గానికి చెందను

విశ్వక్శేనుడు said...

@ఏకలింగం
మామూలు కామెడీనా అసలు పిల్లాట అనే మాట ఎప్పుడో చిన్నప్పుడు మర్చిపొయా మళ్ళీ గురుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు

జీడిపప్పు said...

" అన్నట్లు చెప్పడం మర్చిపోయా జీడిపప్పు గారి మీదా కూడా కేసు వేసే ఆలోచనలో వున్నా"

ఏదో మంచివారు అనుకుంటే నా పైనే కేసు వేస్తారా? మలక్ పెట్ రౌడీ గారి మీద కేసు వేస్తున్నానని నాపైన కేసు వేస్తున్నందుకు మీ పైన అట్రాసిటీ కేసు వేస్తాను. మీ IP Address నాకు తెలుసు. మీ ఫోటో నాకు తెలుసు.
నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి. Source

Anonymous said...

All these cases shld be handed over to one and only cyber detective martahnda

Anonymous said...

I dont know abt technology,is it possible to find out the caste of a person based on IP address, i want to file a case too.
Any help will be greatly appreciated

Anonymous said...

hahaha...ho ho ho....hee hee hee... great comedy.Full throttle bloggers!!!

Anonymous said...

Ori nayano nenu ippatinundi evari blog cadavanu cadivina comment rayanu.

wordpress, website la assalu comment raaya.

pustakam, poddu svarupalu bayata paddayi vallaki assalu raya. mail id kooda iyyanu.

meeru evaru ivvaddu. mimmalni edo kesula irikistaru.

నాగప్రసాద్ said...

http://nagaprasadv.blogspot.com/2009/06/blog-post_21.html

Anonymous said...

Nagaprasad, i am not able to post comment on ur blog as anon, another blog theme as well as challenge for u
కోర్టు హాలంతా బ్లాగరులతో కిక్కిరిసి ఉంది , ఎందుకంటే ఈ రోజు బ్లాగు కేసులో అంతిమ తీర్పు ,వాదోపవాదాలు తీవ్రం గా జరుగుతున్నాయి
బోనులో నిలబడ్డ వ్యక్తి ......
ఇక రాస్కోండి టపా

Anonymous said...

From now on ip adrress will be the inti peru for all telugu bloggers
What an idea sir ji

Anonymous said...

my earlier comment was meant to aha naa blogu anta
sorry nagaprasad

విశ్వక్శేనుడు said...

@జీడిపప్పు
అన్నా నిజంగా నిజం పైన మీరు రాసిన ఆంగ్ల ముక్కల్లో ఒక్కదానికి కూడా నాకు అర్ధం తెలియదు. ఓట్టు.
@all anonymous
please comment with at least names. i even can't take appraisal.........
so please comment with names at least so that i can reply you.

జిల్లేడు పప్పు said...

నేను తెలుగు భాష మీదే ఖేసు పెట్ట బోతున్నా.అది కూడా అమెరిఖా ఖోర్టులో,అక్కడైతే ఒక్క గంటలో తీర్పు వస్తుంది.

విశ్వక్శేనుడు said...

నేను ఇప్పుడే చైనీయుడిగా మారా.........
ఇప్పుడు నాది చైనా బాష.............
ఛిన ఛన్ ఛున్ హ్యుఇ......
దీని అర్ధం చెప్పుకోండి చూద్దాం

గాడిద said...

కేసులు వేస్తామని బెదిరించే వాళ్ళ మీద కూడా కేసులు వేసుకోవచు అని ఇప్పుడే కత్తి గారు సెలవిచారు
ఆ ప్రాతిపదికిన మీ మీద నేను ఇంకో కేసు ఇక చూస్కో నా సామిరంగా
య్యే లబాసృబా కజాకినీ రుసగా జికలీ కురియ కురియాచు కురియ కురియ

విశ్వక్శేనుడు said...

@hey guys i am going sleep. Tell me tomorrow whether i win any of the cases my case and the suits on me ..........i will give you a big party whether i win or loose.

ఏక లింగం said...

LOL...
కామెంట్ తమ్ముడిదయినా కేసు కామనే అన్నా..

నాగప్రసాద్ said...

Anonymous గారు, నా బ్లాగులో కామెంట్ చేయడానికి ఎటువంటి సమస్యా లేదు. ఇప్పుడే పరిశీలించాను. బహుశా మీరు కామెంట్ పబ్లిష్ చేసేటప్పుడు, ఒక్కోసారి blogspot బ్లాగుల్లో error message చూపిస్తుంది. మళ్ళీ ప్రయత్నించండి.

IP Address లను ఇంటిపేరు గానా? కేక ఐడియా. :)

Shashank said...
This comment has been removed by the author.
Shashank said...

గురు నీ మీద కేసు పెడతా.. http://aakasam.blogspot.com/2009/06/blog-post_21.html

Anonymous said...

please visit my blog http://dhoommachara.blogspot.com for my new post..

raghu said...
This comment has been removed by a blog administrator.
గీతాచార్య said...

ఏమైపోయావ్ బ్రదర్ ఈ మధ్య కనబడటం లేదు...

గీతాచార్య said...

మీరు కనబడటం లేదని ఎవరి మీద కేసెయ్యాలో తెలియక సతమతమౌతున్నా. :-(

ఒకసారి ఇది చూసిపెట్టండి.

http://booksandgalfriends.blogspot.com/2009/07/dhanaraj-manmadha-motorcycle-diaries.html

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
కొత్త పాళీ said...

Sir, please control the disgusting comments in your blog.

విశ్వక్శేనుడు said...

@ కొత్తపాళీ

First of all as the blog administrator i am sorry for those comments in blog. ఇదంతా నేను కొన్ని రోజులు బ్లాగ్ కి దూరంగా ఉండడం వల్ల, కామెంట్ మొడరేషన్ లేకపోవడం వల్ల వచ్చిన తిప్పలు. ఇక నుండి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ రాకుండా చూసుకుంటానని మనవి.

విశ్వక్శేనుడు said...

@గీతాచార్య
ఎక్కడికి పొలేదు బ్రదర్ ఈ మధ్య కొంచం పని ఎక్కువ ఉంది(చేసిన పని మల్లీ చెయ్యల్సిరావడం వల్ల)

గీతాచార్య said...

Ok. Welcome back bro.

Money Purse said...

మీ కేసులగోదవేమోగాని మా ఫ్రెండ్ ఒక లాయరు కాళీగా ఉన్నాడండీ,

గీతాచార్య said...

బ్రదరూ,

ఇది వర్డ్ ప్రెస్ థీం లా ఉంది. సూపర్ సెట్టింగ్ పెట్టావ్. కన్వర్షనేమన్నా చేశావా?

Post a Comment