About The Author

This is a sample info about the author. Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Quisque sed felis.

Get The Latest News

Sign up to receive latest news

Tuesday, May 19, 2009

ఎలాంటి కంప్యూటర్ కి ఎలాంటి లినక్సు వాడాలి.

మనలో చాలా మందికి లినక్సు వాడాలి అనుకున్నప్పుడు మొదట వచ్చే సందేహం మన కంప్యూటర్ కి లినక్సు flavour ఏదైతే బాగుంటుంది అని.
లినక్సు వాడాలి అనుకున్నప్పుడు ముందుగా చెయ్యాల్సిన పని మన కంప్యూటర్ కాన్ఫిగరేషన్ చూసుకోవడం.
ఇప్పుడు Red Hat linux తీసుకుంటే అది ఇంటెల్ ప్రాసెసర్ వున్న కంప్యూటర్ మీద చాలా బాగా పని చేస్తుంది. అంటే మిగిలిన వాటిమీద పని చెయ్యదని కాదు కానీ ఇంటెల్ మీద బాగా పని చేస్తుంది.
అదే AMD preocessor వాడే వాళ్లు ఐతే SUSE చాలా బాగా పని చేస్తుంది.

Red Hat linux అనేది కంపెనీ మనకి ముఖ్యంగా రెండు flavours లో దొరుకుంతుంది.
1. Red Hat Enterprise Linux దీనినే RHELinux అంటారు.
2.Fedora Core. దీనిని సింపుల్ గా fedora ani fc ani అంటారు.
మొదటిది paid వెర్షన్ అంటే డబ్బుకట్టి కొనుక్కోవాలి అన్నమాట. దీనికి సాఫ్ట్వేర్ compatability గాని
updates గాని చాలా బాగుంటాయి. అవసరం వచ్చినప్పుడు కంపెనీ నుంచి హెల్ప్ కూడా తీసుకోవచ్చు.
రెండవది freeware. అంటే ఇది నెట్ నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇది ఫీల్ అండ్ లుక్ చాలా బాగావుటుంది. మనకి కావాల్సిన అన్ని సోఫ్త్వర్స్ అన్ని fedora వాళ్ల package repositaries లో దొరుకుతాయి.

Debian and Ubuntu

Debian అనేది బేసిక్ లినక్సు లాంటిది. బేసిక్ గా లినక్సు అనేది ప్రోగ్రామింగ్ కోసం కాబట్టి ఇది ప్రోగ్రామింగు బాగా నిర్వర్తిస్తుంది. దీంట్లో అన్ని రకాల ప్రోగ్రామింగ్ కి కావసిన అన్ని లిబ్రరీస్ default గా వుంటాయి.
Ubuntu అనేది Debian మీద develop చేయబడింది. ఇక ఇది అన్ని పనులు GUI(graphical user interface) అంటే మౌస్ వుపయోగించి చేసుకునే సదుపాయం కలిపిస్తుంది. ఇది కామన్ user కి అతికినట్టు గా సరిపోతుంది. ఇది ప్రోగ్రామింగు చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వుపయోగ పడుతుంది. దీనికి సాఫ్ట్వేర్ compatability చాలా ఎక్కువ. users చాలా ఎక్కువ. అందువల్ల దీనికి దొరికే అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ.

ఇహపోతే ఇంకొక ప్రసిద్ది పొదిన లినక్సు distribution SUSE. SUSE రెండు flavours లో లభిస్తుంది. మొదటిది SUSE linux idi paid version. రెండవది openSUSE ఇది freeversion. దీనికి దాదాపుగా అన్ని రకాల appications దొరుకుతాయి. application installation కి openSUSE వాళ్లు one click installation packages provide చేస్తారు. అంటే సరాసరి site కి వెళ్లిపోయి అక్కడ search box లో మనకి కావలసిన application type చేస్తే applications display అవుతాయి. ప్రతి application కి one click installation option వుటుంది. ఇది సాదారణ users కి వుపయోగించడం కొంచం సులభతరం చేస్తుంది.

Processor తరువాత చూసుకోవలసినది graphic card. intel graphic card ఐతే అన్ని distributions చాలా బాగా పని చేస్తాయి. కానీ nVidia graphic card ఐతే మాత్రం మళ్లీ drivers install చేసుకోవాలి. నాకు తెలిసినంతవరకు nVidia graphic card కి openSUSE చాలా బాగా పని చేస్తుంది.

ప్రస్తుతానికి ఇంతే. కామెంట్స్ లో వచ్చే అనుమానాలని బట్టి మిగిలిన విషయాలు ఇంకొక టపా లో రాస్తా అంతదాకా సెలవు.

10 comments:

ఫజ్లుర్ రహమాన్ నాయక్ said...

Ubuntu also supports the nvidia graphic card ... The only thing is that ... we have to install the nvidia drivers from the repositories ... :)

విజయ మాధవ said...

@ఫజ్లుర్ రహమాన్ నాయక్
support చేస్తుంది కాని openSUSE చలా బాగ పని చేస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నను. అదే పైన చెప్పింది.

Praveen's talks said...

I use Ubuntu and Suse in my computers.

విజయ మాధవ said...

@praveen's talks
nice

భాస్కర్ రామరాజు said...

నేను, నా లాప్టాప్ లో ఆర్.హెచ్.ఈ.యల్ 5.2
నా సిస్టంలో డ్యూయల్ బూట్ - విస్తా + ఊబున్టూ
నా ఐ.బి.యం ఎక్స్ సిరీస్ సర్వర్ పై సుసి
నా సన్ బ్లేడ్ పై సొలారిస్ స్పార్స్ 10.4 పైన విర్చ్యువల్ బాక్స్, దాంట్లో ఆర్.హెచ్.ఈ.యల్
నా కార్యాలయంలో నా డెస్క్టాప్ పై, విర్చ్యువల్ బాక్స్ లో ఆర్.హెచ్.ఈ.యల్ 5.2
వాడతాను.
నా వద్ద ఒక ఐ.బి.యం హెచ్.ఎస్ 20 బ్లేడ్ ఉంది. చాలా తక్కువకి వస్తే కొన్నా. దానికి ఛాసిస్ లేదు. ఇక ఏపార్టుకి ఆ పార్టు పీకి, ఒక 1u తయ్యారు చేద్దాం అనుకుంటున్నా. ఇది క్సియాన్ డ్యూయల్ కోర్ తో వన్ గిగ్ ర్యాం తో ఉంది...

భాస్కర్ రామరాజు said...

కామెంటు పుబ్లిష్ చేసేప్పుడు వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి

విజయ మాధవ said...

@Bhaskar Ramaraju

తీసివేసాను
ధన్యవాధములు

గీతాచార్య said...

Very good info.

విజయ మాధవ said...

@గీతాచార్య
ధన్యవాధములు

గీతాచార్య said...

What about Mandriva bro. It's the new sensation. But I have been learning it. Shall u write a post on it?

Post a Comment